సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ లో అనేక ఎకరాల భూములు రూపాయి చప్పున రాష్ట్ర ప్రభుత్వం నుండి లీజు కు తీసుకొన్నఉర్సా NRI కంపెనీలో కూడా ఎంపీ చిన్ని కీలక పాత్రధారి అని కేశినేని నాని గతంలో ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను ఎంపీ చిన్ని నిజం నిరూపించాలని సవాల్ చెయ్యడం జరిగింది. అయితే ఇటీవల చంద్రబాబు సర్కార్ ఏపీ లిక్కర్ స్కాం ఆరోపణలపై గత వైసీపీ ప్రభుత్వం పెద్దలను జైలుకు పంపేవరకు వదలరని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో.. ఊహించని ట్విస్ట్ తగిలింది. ఆ లిక్కర్ స్కాం ఇప్పుడు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని చాపక్రిందకు చేరటం అందరిని విస్తుపోయేలా చేసింది. లిక్కర్ స్కాం లో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న వైసీపీ కి చెందిన కేశిరెడ్డి కి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార పార్టనర్స్ అని, ఇద్దరిది ఒకే ఈ మెయిల్ పెట్టుకొనేంత మస్తు దోస్తులని తన ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ కేశినేని నాని సీఎం చంద్రబాబు కు రాస్తున్న లేఖలతో అందరు విస్తుపోతున్నారు. విషయంలోకి వెళితే బెజవాడలో కేశినేని నాని-తమ్ము డు చిన్ని మధ్య రాజకీయ రచ్చ అందరికి తెలిసిందే. లిక్కర్ స్కా మ్‌లో విజయవాడ ఎం పీ కేశినేని చిన్ని ప్రమేయం ఉందంటూ మరోసారి తాజగా ఫేస్‌బుక్ వేదికగా ఆరోపణలు గుప్పించారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఆయన. ‘దొరా నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పి నాబుకాయించినా నువ్వు రాజ్ కెసిరెడ్డి కలసి 2019 డిసెంబర్ నుండి మద్యం కుంభకోణం సొమ్ములు నీకు, నీవారికి సంబందించిన దాదాపు 56 డొల్ల కంపెనీల ద్వారా దేశ విదేశాలకు దారి మళ్లించిన విషయం యదార్థం ’ అని మరో తీవ్ర స్థాయి ఆరోపణ చేసారు.
