సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఒరిస్సా లో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో నడిచే పలు రైళ్లు రద్దు చేసిన విషయం విదితమే.. అయితే వాటిలో రద్దయిన కొన్ని రైళ్లను ఈ నెల 9 వరకూ తిరిగి పునరుద్ధరించే అవకాశాలు? లేవని అధికార వర్గాల సమాచారం. అయితే, కోరమాండల్ ప్రమాదానికి విజయవాడ-విశాఖ సెక్షన్ మధ్య పలు రైళ్ల రద్దుకు సంబంధం ఏమిటి? ఇవన్నీ దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా వెళ్లే రైళ్లు .. అని పలువురు ప్రయాణికులు వేస్తున్న ప్రశ్నకు రైల్వే అధికారుల నుండి స్వాందన లేదు. ఇక రద్దయిన రైళ్లల్లో 17240 నంబరుగల విశాఖ-గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, 22701 నంబరు గల విశాఖ-విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 17267 నంబరు గల విశాఖ-కాకినాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 17258 నంబరు గల కాకినాడ-విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 07467 నంబరు గల విశాఖ-రాజమండ్రి వెళ్లే ఎక్స్‌ప్రె్‌స, 17239 నంబరు గల గుంటూరు-విశాఖ వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, 22702 నంబరు గల విజయవాడ-విశాఖ వెళ్లే ఎక్‌ప్రెస్, 17268 నంబరు గల కాకినాడ-విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 17257 నంబరు గల విజయవాడ-కాకినాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 07466 నంబరు గల రాజమండ్రి విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రెస్ లు ఈ నెల 9 నుండి పునరుద్దరించే అవకాసమ్ ఉంది.
