సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాపట్లలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా తో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇటీవల తనను, మిదున్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మద్యం కుంబకోణంలో చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని , ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం చంద్రబాబు జైలులో పెట్టారన్న అక్కసుతో ఆమె వ్యక్తిగతంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి నేను లిక్కర్ తాగను, నాన్‌వెజ్ తినను.. ఒకవేళ పురందేశ్వరి గారు మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు. ఏమేం బ్రాండ్లు ఉంటాయో కూడా తెలియదు. ఆమె ఈ విషయం తెలుసుకుని మాట్లాడితే బాగుండేది’ ..ఇంకోసారి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే మాత్రం పురందేశ్వరి అసలు బండారం, ఆమె గతంలో.. చేసిన పనులు తాను బయట పెడతానని , ఆ తరువాత ఆమె ఎక్కడ ఏం చేసుకుంటుందో? తెలియదని.. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. దీనిపై నేడు, ఆదివారం బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వెంటనే విజయసాయి లెంపలు వేసుకుని.. పురందేశ్వరికి క్షమాపణ చెప్పాలని బుద్ది ఉన్నవారు ఎవరూ ఇలా మాట్లారని అన్నారు. వైసీపీలో అందరూ కొడాలి నానిలా కావాలనుకుంటున్నారని.. విజయసాయి కూడా అదే మార్గంలో వెళుతున్నారని, వచ్చే ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరగటం ఖాయం అని విమర్శించారు
