సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పులివెందులలో పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకొని పూల అంగళ్లు వద్దకు రావడంతో అక్కడ త్రోపులాట జరిగి ఉద్రిక్తత తలెత్తింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. ఓపెన్ టాప్ జీప్‌తో చంద్రబాబు నేటి రాత్రికి టీడీపీ బహిరంగ సభ స్థలానికి చేరుకొన్నారు. అయితే పులివెందుల పూలంగళ్ల సర్కిల్లో చంద్రబాబు బహిరంగ సభకు పట్టణంలో ఉద్రికతల మధ్య అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. పూలంగళ్ల సర్కిల్లో భారీగా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. అనుమతి లేదంటూ మీడియా వాహనాన్ని పోలీసులు ముందుకు పంపుతున్నారు. సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పులివెందుల్లో హైటెన్షన్ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *