సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు, గురువారం తన స్వంత నియోజక వర్గంలో ఆధ్యాత్మిక శోభ పెంపొందేలా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం శంకుస్థాపనలు చెయ్యడం జరిగింది. ముఖ్యముగా పులివెందుల లో సుమారు 5 కోట్ల పైగా వ్యయంతో ప్రభుత్వ సహకారంతో ఎంతో సుందరంగా నిర్మించిన శ్రీ కృష్ణుని గుడిని సీఎం జగన్ ప్రారంభించి శాస్త్రోకంగా పూజలలో పాల్గొన్నారు. అలాగే పులివెందులలో హిందు సంస్కృతీ వేద సంప్రదాయాలు పరిపుష్టం చేసేవిధంగా 60 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న, .. స్వామి నారాయణ్ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసారు సీఎం జగన్ . ఆయనకు పండితులు నుదుట కుంకుమ పెట్టి శాలువా కప్పి శాస్త్రోక్తంగా వేద విద్యా ర్థులు చేత ఆహ్వానించారు. స్వా మి నారాయణ్ వేద పాఠశాల ఏర్పాటుకు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం మరో విశేషం. తదుపరి పులివెందులలోని ఆదిత్యా బిర్లాయూనిట్కు వెళ్లి యూనిట్ పరిశీలించారు, అక్కడ అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ ల్యాబొరేటరీ లను ప్రారంభించారు. ఇంకా పులివెందులలో నూతనంగా తీర్చిదిద్దిన శిల్పా రామం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *