సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కలెక్షన్స్ ప్రభజనం సృష్టిస్తుంది. విడుదలయిన్ కేవలం 3 రోజులలో 500 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు ఆవిష్కారించింది. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాచ బాట వేసి 1850 కోట్ల రూపాయల పైగా వసూళ్లతో గత 7 ఏళ్లుగా భారతీయ తెలుగు సినిమా రికార్డ్స్ పరంపరకు ” కింగ్” లా నిలచిన ప్రభాస్ .. బాహుబలి 2 సినిమా దరి దాపులలోకి వెళ్లే మరో తెలుగు సినిమా గా పుష్ప 2 కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ఒక వేళా ఆ రికార్డు కూడా అధిగమిస్తే తెలుగు వాళ్లందరికీ గర్వకారణమే..నార్త్ ఇండియాలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పుష్ప 2 షోలు వేస్తూనే ఉన్నారు. హౌస్ ఫుల్ అవుతూనే ఉన్నాయి. అమెరికాలో కలెక్షన్స్ 10 మిలియన్ డాలర్స్ సమీపిస్తున్నాయి. ఇక భీమవరం లో గత 3 రోజులకు వేసిన 72 షో లకు 80 లక్షల పైగా కలెక్షన్ వసూళ్లు సాధించాడు పుష్పా 2.. నేడు ఆదివారం పట్నం మొత్తం మీద 22 నుండి 25 షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. బహుశా నేటి ఆదివారం తో కలపి కేవలం 4 రోజులలోనే కోటి రూపాయలు గ్రాస్ కలెక్షన్ అధిగమించే అవకాశం ఉంది. సినిమా నిడివి 3న్నర గంటలు ఉండటం తో ఎక్కువ షో లు వెయ్యడం కుదరటం లేదు.. రేపు సోమవారం మాత్రం కోటి రూపాయలు పక్కా .. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కేవలం 3 రోజులకే 6 కోట్ల రూపాయలు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు సమాచారం.. రాష్ట్రంలో ఎన్ని వివాదాలు ఉన్న నేషనల్ కాదు.. ఇంటర్ నేషనల్.. తగ్గేదే లే.. అంటూ గర్జించిన అల్లు అర్జున్ డైలాగ్ ను పుష్ప 2 నిజం చేసింది.
