సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా అభిమానులు ఎంతో ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నా .. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ నుంచి టీజర్ నేడు, శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసారు, నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ అభిమానులకు కానుకగా 3 నిమిషాల సినిమా టీజర్ ను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో ‘పుష్ప ఎక్కడ’ అన్న కాన్సెప్ట్ తో తీసిన టీజర్ అది. చివరికి పుష్ప కనిపించి ఇంక పుష్ప గాడి రూల్ మొదలయింది అనేట్టుగా చెప్పారు.దర్శకుడు సుకుమార్ ఈ టీజర్ లో బాగా హైప్ చూపించాడు పోలిసుల ఎన్కౌంటర్ లో 8 బుల్లెట్స్ దిగి గాయపడిన పుష్ప . ఎటు పోయాడు?, ఎక్కడికి పోయాడు, బుల్లెట్స్ తగిలి చనిపోయాడా, ఎక్కడ పుష్ప అన్న విషయాన్ని బాగా హైప్ చేయగలిగాడు. అలాగే పుష్ప అనేవాడు డబ్బు ఎలా సంపాదించాడు? అని కాదు, సంపాదించినా డబ్బును ఏమి చేసాడు అనే విషయం కూడా చూపించాడు సుకుమార్.. టీజర్ చివరలో అడవిలో పులి ఎలా భయం లేకుండా తిరుగుతుందో పుష్ప కూడా భయం లేకుండా అదే అడవిలో తిరుగుతూ ఉంటాడు. పుష్ప ను చూసి పులి వెనక్కి తగ్గుతుంది..అది ఒక హైలైట్ గా చూపించారు. మొత్తానికి పుష్ప 2 టీజర్ సినిమా కథను ప్రేక్షకులకు ముందే పరిచయం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *