సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండియా, అమెరికా,పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఆప్ఘనిస్తాన్ దేశం ఏదయినా కానీ అందరు సినీ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చుస్తునారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చెయ్యబోతున్నారు మేకర్స్. ఇక ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సాయంత్రం 6.03 గంటలకు లక్షలాది బిహారి అభిమానుల మధ్య ఈ ట్రైలర్రానుంది. దీనికోసం భారీ భధ్రత ఏర్పాట్లు చేసారు.
