సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లు అర్జున్ హీరోగా ప్రపం చవ్యా ప్తంగా పుష్ప -2 సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో నేటి బుధవారం రాత్రి 9గంటల నుండి ఏకంగా 12000 పైగా థియేటర్స్ లో బెనిఫిట్ షో లతో సహా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ తన జోరు చూపిస్తోంది. విడుదలకు కొన్ని గంటల ముందే, ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డు సృష్టించింది. అమెరికా మార్కెట్ లో పుష్ప -2 సినిమా విడుదలకు ముందే ప్రీమియర్స్ తో కలిపి ఏకంగా 2.7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. అయితే కీలకమైన తెలుగు రాష్ట్రాల్లోఈ సినిమాకు టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో..బెనిఫిట్ షో లకు 800 నుండి 1000రూపాయలు దాటిన టికెట్స్ ధరలకు కూడా ‘అభిమానులు ఒకే’ అన్నారు. కానీ మిడ్-నైట్ షోలకు కూడా అదే ధర ఉండటంతో పెద్దగా డిమాండ్ లేదు. దానితో చాలాచోట్ల ఈరోజు రాత్రి 9.30కు ప్రీమియర్స్ వేసి, తిరిగి రేపు ఉదయం 5 గంటల నుంచే షోలు మొదలుపెడుతున్నారు. ఇకతెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రధాన థియేటర్స్ మినహా మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు చాలావరకు తగ్గించారు. సినిమా బాగుంటే సాధారణ టికెట్స్ ధరలకు కూడా భారీ కలెక్షన్ వస్తుంది. అయితే 2000 కలెక్షన్స్ కొట్టేయాలన్న యావతో..ఏది ఏమైనా ప్రేక్షకులలో క్రేజ్ ఉందని వరుసగా 12 రోజుల పాటు టికెట్స్ రేట్లు భారీ రేట్లకు అమ్మటం విషయం మాత్రం మధ్యతరగతి వర్గాల ప్రేక్షకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో భీమవరంలో పుష్ప 11 థియేటర్స్ లో రిలీజ్ కానుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *