సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్బంగా AP స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భీమవరం యూనిట్ ఆధ్వర్యంలో NSS పాల్ అధ్యక్షతన జరిగిన సభకు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ MLC బొర్రా గోపీమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ ఉద్యోగి ప్రాధమిక హక్కు. ఎవరి దయా భిక్ష కాదు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ రద్దుచేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అని పేర్కొన్నారు. తన గెలుపుకు పెన్షనర్స్ ఎంతో కృషి చేశారని అన్నారు అంతకు ముందు DS నకార మరియు YV చంద్రచూడ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్సులు జి. జేమ్స్, Dr. SSN రాజు మాట్లాడుతూ 70,75 సంవత్సరాలకు ఇచ్చే అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వం తగ్గించిందని దానిని పునరుద్దరించవలసిన అవసరం ఉందని పెండింగ్ DA లు వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు. అనంతరం 9 మంది సూపర్ సీనియర్ పెన్షనర్స్ దండు తమ్మిరాజు, P.సూర్యనారాయణ రాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, మంతెన సత్యనారాయణ రాజు, విప్పర్తి అన్నపూర్ణమ్మ, K.మోజెస్, D.నాగముని, G.విశ్వనాధం, M.S.N.రాజు గార్లకు సన్మానం జరిగింది
