సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: . నేడు, ఆదివారం ఉండవల్లిలో అమరజీవి’ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరిగింది. స్వర్గీయ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాల వేసి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నేడు, పొట్టి శ్రీరాములు 120వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామనిఅన్నారు. నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ది చేస్తాం… ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొనుగులు చేసి దానిని ఆయన జ్ఞాపకంగా భావితరాలకు మ్యూజియంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజు కు చాలా తేదీలు వచ్చినా.. డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసిన రోజు కాబట్టి.. ఆరోజునే పొట్టి శ్రీరాములను మనం స్మరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
