సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కొత్త బస్సు స్టాండ్ నుండి నేటి ఆదివారం రాత్రి 8 గంటల నుండి మరో 2 కొత్త RTC సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ లు వైజాగ్ వైపు ప్రారంభిస్తున్నారు. 1) భీమవరం -పలాస కొత్త RTC సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ ప్రారంభం. ( Via కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, టెక్కలి ). గతంలో ఈ సర్వీస్ విశాఖపట్నం వరకు ఉండేది.అనేక మంది ప్రయాణికుల కోరిక ను అనుసరించి ఎమ్మెల్యే అంజిబాబు విజ్ఞప్తి మేరకు నేటి నుండి పలాస వరకు పొడిగిస్తున్నారు. 2) భీమవరం – విశాఖపట్నం కొత్త గా మరో సూపర్ లగ్జరీ బస్ ప్రారంభిస్తున్నారు. ఈ బస్సు వయా,, వీరవాసరం, ,నౌడూరు, బ్రాహ్మణ చెరువు,మార్టేరు, కాకినాడ మీదుగా విశాఖ పట్నం చేరుతుంది.
