సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు సాధించి..తమిళనాట సంచలన విజయం తెలుగు హిందీలో కూడా విజయం సాధించిన మణిరత్నం ‘పొన్ని యిన్ సెల్వ న్’ 1 సిరీస్ పార్ట్ 2 పట్ల సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ చిత్ర బృందం ‘పొన్నియిన్ సేల్వన్-2’ వచ్చే 2023, ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటిస్తూ తాజగా నేటి, బుధవారం సాయంత్రం ఒక టీజర్ వీడియో ను రిలీజ్ చెయ్యడం విశేషం. ఇందులో ఆదిత్య కరికాలన్ (విక్రమ్), నందిని (ఐశ్వర్యరాయ్) పాత్రల మధ్య ప్రేమ సన్నివేశాలు, వారి విభేదాలకు కారణాలు హైలైట్ గా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఇక పొన్నియిన్ (జయం రవి), వందియదేవన్ (కార్తీ) పాత్రలతో పాటు కుందవై (త్రిష) ఎలాంటి రాజనీతిజ్ఞత ఉపయోగిం చింది? అనే విషయాలను రెండో భాగం లో మణిరత్నం చూపించనున్నా రు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అందిస్తుంది.
