సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపోలవరం ప్రాజెక్టు ను సందర్శించి ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు. ఉదయం హెలీకాప్టర్‌లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకొని ఇటీవల తిరిగి చేపడుతున్న రూ. 990 కోట్ల వ్యయంతో చేపట్టిన డయాఫ్రంవాల్ పనులు (Diaphragm Wall), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ (Cofferdam)లను పరిశీలించారు. స్థానికుల సహాయపునరావాస కార్యక్రమాలపైనే , కాంట్రాక్ట్ సంస్థలు, ఇంజనీర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో తన పాలన హయాంలోనే, 2014-19 కాలంలోనే పోలవరం పనులు 72 శాతం పూర్తి చేసానని, తమ హయాంలో వందలాది కోట్లతో నిర్మించిన డయవల్ నిర్మాణం జగన్ హయాంలో వరదలు వచ్చినప్పుడు పర్యవేక్షణ లేక ద్వంసం చేసారని, తాము అధికారంలో అపట్లో రూ.829 కోట్లు నేరుగా అప్పటి నిర్వా సితుల ఖాతాలో వేసిన ఘనత మా ప్రభుత్వా నిది. తరువాత జగన్ అధికారంలోకి వచ్చా, స్థానిక నిర్వాసితులకు ఇచ్చింది ఏమి లేదని, అయితే ఇప్పుడు మరల మన ప్రభుత్వం వచ్ఛోక నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నామని అన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్క న పెట్టారు. ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లిం చారు. మేము మాత్రం ఎట్టి పరిస్థితులలో పోలవరం లో నీళ్లు వదిలే ముందే.. 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తిచేస్తాం అన్ని ప్రకటించారు.
