సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ,ఉండి, ఆచంట, నరసాపురం నియోజకవర్గాలలో తీవ్ర స్థాయిలో నువ్వా నేనా అనే స్థాయిలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో పందాల రాయుళ్లు వాటితో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత కీలక నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న కుప్పం, పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ,సత్తెనపల్లి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపుల గురించి జోరుగా పందెలు వేస్తున్నారని తెలిసింది. ఈ ఎన్నికల వేళా బెటింగ్ కు పాలబడే వారి మధ్య మధ్యవర్తులు ( బుకీలు) వారి కమిషన్ కు డోకా లేకుండా ఇదో సీజన్ వ్యాపారంగా ఎంచుకొంటారు మరి..చట్టానికి దొరక కుండా ప్రత్యేక మైన కోడింగ్ తో బెట్టింగ్ దారులు అప్ డేట్ అయ్యారు మరి.. అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్న అందరు వేల రూపాయలు మొదలుకొని కోట్లు పోగొట్టుకొనే ఈ వ్యసనానికి దూరంగా ఉంటె మంచిది.
