సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగునాట ఆస్తుల కోసం ప్రముఖుల ఇండ్ల లో ఇంటింటా రచ్చ మాములుగా లేదు. మంచు కుటుంబం లో వివాదాలు ఎన్నోసార్లు దాచుకొన్న తాజగా బట్ట బయలు అయ్యింది. హైదరాబాద్ లో సీనియర్ హీరో మోహన్‌బాబు , మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. తన చిన్న కుమారుడు మంచు మనోజ్ అతని భార్య మౌనికల నుండి 78 ఏళ్ళ సీనియర్ సిటిజన్ తనను రక్షించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ దంపతులపై కేసు పెట్టారు. మరోవైపు మనోజ్ తనపై తండ్రి అనుచరులుతన ఇంటికి వచ్చి పెద్దగా అరుస్తూ దాడి చేసారని సిసి కెమెరాలను పీకేసి పట్టుకెళ్లారని పిర్యాదు తో మోహన్‌బాబు, అతని పది మంది అనుచరులపై కేసు నమోదైంది. మరోవైపు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కాసేపటి క్రితమే దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకొని తాజా పరిణామాలపై మోహన్ బాబు కుటుంబ బంధుమిత్రులతో చర్చలు జరుపుతున్నారు.
