సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. అభ్యర్థుల ప్రచారానికి, ప్రకటనలకు ఫుల్ స్టాప్ పెట్టేసారు. మొత్తం ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇక ఓటర్లు ను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాల పంపిణి కార్యక్రమానికి తెరలేచింది. గత శనివారం సాయంత్రం ప్రచారపర్వానికి తెరపడింది. హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. బస్సు స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ రద్దీగా ఉన్నాయి. ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మినా ఆదేశాలు ప్రకారం.. అధికారులు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే.. అంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు. మందు బాబులకు 2 రోజులు పాటు లిక్కర్ షాపులు తెరవరు. మే 13 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం. పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు. ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం. మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.
