సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సాహసోపేత చర్యగా నిలిచిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరం 3 టౌన్ లోని నరసాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ లో పర్యాటకుల మీద దాడి చేసి 26 మంది మరణానికి కారణమైన ఉగ్రవాదులకు సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనీ శిబిరాల పైన ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో ఖచ్చితమైన దాడులు చేసి, ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మొహమ్మద్ (JM) ప్రధాన కార్యాలయాన్ని , వారి శిబిరాలను ధ్వంసం చేశాయన్నారు. ఈ దాడులు భారతదేశం ఉగ్రవాదంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టం చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయి ఇప్పటివరకు ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యల వల్ల అభివృద్ధి చెందిన దేశాల కంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉందని ప్రజలు ఆందోళన పడనక్కరలేదని శ్రీనివాస వర్మ తెలిపారు
