సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విద్యార్ధులకు దసరా సెలవుల్లో మార్పు లు చేయాలని తాజాగా చం ద్రబాబు కూటమి ప్రభుత్వానికి భీమవరం కు చెందిన ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి (Borra Gopi Murthy) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2025–26 కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం .. ప్రకటించిన దసరా సెలవుల తేదీలనుఈ నెల 24 నుండి కాకుండా 12 నుండి మార్చాలని వినతి చేశారు. దసరా పర్వదినాలు ఈ సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో.. ఆ రోజు నుంచే సెలవులు ఇవ్వాలని ఈ మార్పు జరిగితే విద్యార్థులు మొత్తం 12 రోజుల సెలవులు ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 21వ తేదీ నుంచి.. అక్టోబర్ మూడో తేదీ వరకు స్కూ ళ్లకు హాలిడేస్ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *