సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాస్త దురదృష్టంతో పాటు ఎన్ని పరాజయాలు ఎదురయినా క్వాలిటీ సినిమాలు తియ్యడంలో వెనుకాడని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోతేజా సజ్జా, విలన్ గా మంచు మనోజ్, జగపతి బాబు, శ్రీయ సరన్ నటించిన ఈ సోషియో ఫాంటసీ సినిమా నేడు, గురువారం (సెప్టెంబర్ 12వ తేదీ) పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో సాధారణ టికెట్స్ రేట్లకే ఈ సినిమా ప్రదర్శనలు జరుగుతున్నాయి. విదేశాలలో ఇప్పటికి భారీ ఓపెనింగ్స్ తో షో లు పడ్డాయి . . పబ్లిక్ టాక్ ఏమిటంటే .. అశోక చక్రవర్తి కాలానికి లింక్ చేసే ఫాంటసీ కధనం తో సూపర్ యోధగా తేజా సజ్జా పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. బాగా చేసాడు.ఇక హీరో పాత్రను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డిజైన్ చేసిన విధానం కొత్తగా ఉంది. సీజే వర్క్ క్వాలితో ఉంది. ట్రైయిన్ ఫైట్ ఆ లొకేషన్స్ హైలైట్ గా నిలిచాయని అంటున్నారు. కాస్త ‘కల్కి’ సినిమా ఛాయలు కనిపించినప్పటికీ అలాగే విలన్ గా మనోజ్ మంచు కూడా పెర్ఫార్మెన్స్ పరంగా పోటాపోటీగా నటించాడు. కెమెరా పనితనం హాలివుడ్ ను మరపించే గ్రాఫిక్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ లాజిక్ లు ఆలోచించకుండా చిన్నారులను యువతరాన్ని ఆకట్టుకొనే అంశాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమా కు పాజిటివ్ టాక్ వైరల్ అవుతుంది. మరి కలెక్షన్స్ కూడా అదేస్థాయిలో వచ్చి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ని గట్టెకించాలని కోరుకొందాం..
