సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో దసరా వేడుకలులో భాగంగా గత శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ విఫ్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టణంలోని పలు దేవి దేవాలయాలుకు వెళ్లి శ్రీ అమ్మవారలను ఆలయ మర్యాదలతో దర్శించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఏడాది దసరా వేడుకలను ఆర్యవైస్యులు వైభవంగా నిర్వహించే స్థానిక త్యాగరాజ భవనంలోని శ్రీ వాసవి మాత ఆలయాన్ని , అక్కడ ఏర్పాటు చేసిన దసరా వేడుకలను శ్రీ అమ్మవారి విభిన్న ముర్తుల ఎగ్జిబిషన్ ను ఆయన దర్శించుకొని ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విఫ్ అయిన సందర్భములో శ్రీ అమ్మవారి అస్సిసులతో..ఉత్సవాల నిర్వాహకుల ఘన సన్మానాన్ని అందుకోవడం జరిగింది. ఈ సందర్భములో ఆర్యవైశ్య ప్రముఖులు మానేపల్లి నాగేశ్వర రావు , తటవర్తి బద్రి , సభాపతి , జూలూరి బ్రదర్స్ ,తదితర వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
