సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఇండ‌స్ట్రీల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్రముఖ నటుడు, అందమైన విలన్, ముకుల్ దేవ్(Mukul Dev) (54)మరణించారు. ర‌వితేజ, వినాయ‌క్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘కృష్ణ’ సినిమాతో, తరువాత జగపతి బాబు హీరోగా జెడి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ‘సిద్ధం సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఈ న‌టుడు ఆ తర్వాత ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్ వంటి సినిమాల్లో విలన్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. తెలుగులో ఆయ‌న చివ‌రి చిత్రం 2013లో నాగార్జున హీరోగా న‌టించిన భాయ్‌.2022 వరకు హిందీ సినిమాలలో నటించారు. సుమారు పాతికేళ్ల క్రితం ఫైల‌ట్ వృత్తికి మ‌ధ్య‌లోనే గుడ్‌బై చెప్పి 1996లో విశ్వ సుంద‌రి సుస్మిత‌సేన్‌కు జంట‌గా ద‌స్త‌క్ అనే హిందీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ న‌టుడు సింహాద్రి, టక్కరి దొంగ నాయ‌క్‌, వంటి సినిమాల్లో విల‌న్ గా న‌టించిన రాహూల్ దేవ్ ముకుల్‌కు స్వ‌యానా సోద‌రుడు. అయితే..కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ముకుల్ అనుకోకుండా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరి చికిత్స‌ పొందుతూ అక్క‌డే మృతి చెందాడు. ఆయన మరణంపై ప‌లువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *