సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఫ్యామిలీ సినీ హీరో స్థాయి నుండి మాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయికి ఎదగాలని హీరో నాని (Nani) హీరోగా, నిర్మాతగా చేస్తున్న ప్రయత్నం మరోసారి విపలం అయ్యింది. అడుగడుగున విపరీతమైన హింస తో శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌వంత‌మైన‌ హిట్ యూనివ‌ర్స్‌లో భాగంగా మే1 గురువారం రోజున‌ ప్ర‌పంచ‌ వ్యాప్తంగా థియేట‌ర్లలోకి వ‌చ్చి హిట్‌3 (HIT 3). మంచి ఓపెనింగ్ వచ్చిన కూడా మూడోరోజు నుండి థియేటర్స్ ఖాళీ కావడంతో తాము నష్టపోయామని. 100 కోట్లు వసూళ్లు అంటూ ఫేక్ పబ్లిసిటీ’ చెయ్యడం తప్పని, నాని గత సినిమాలు కూడా అతి కష్టం మీద నష్టాల నుండి బయట పడ్డామని స్వయంగా డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. మనుషులను పశువుల మాదిరి నరికే, హీరో అర్జున్ సర్కార్ (నాని) వైజాగ్ హిట్ టీమ్‌లో ఎస్పీగా కదంశంతో రక్తపాతం పరమావధిగా నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ మే నెల 29 నుంచి అంటే మ‌రో ఐదు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT)లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది. అయితే సున్నిత మ‌న‌స్కులు, పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండ‌డం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *