సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్ సందడి గత రాత్రి నుండి నేటి ఆదివారం మధ్యాహ్నం వరకు నెలకొంది. పట్టణ, గ్రామాల్లో షాపుల వద్ద కేక్‌లు, బిర్యానికి డిమాండ్ పెరిగింది. పలు షాపుల వద్ద ముగ్గులు వేసేందుకు కావాల్సిన రంగులు అమ్మకాలు జరిపారు. ప్రశాంత వాతావరణంలో యువత కేక్‌లు కట్ చేసేందుకు, న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపు కొంటున్నారు. మద్యం అమ్మకాలు బాగానే జరిగాయి. ఇక జిల్లా రాజధాని కేంద్రం భీమవరం లో అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సారి న్యూ ఇయర్ వేడుకలు కాస్త తక్కువగానే జరిగాయి అని చప్పవచ్చు. గతంలో సాయంత్రం 6 గంటల నుండి 9గంటల వరకు ఉండే మార్కెట్ రద్దీ ఈసారి కానరాలేదు. బట్టల షాపులు ఫ్యాన్సీ గృహోపకరణ వస్తువుల షాపుల్లో రద్దీ కనపడింది. ఎక్కడ చుసిన అధిక ధరలు కు విక్రయాలు జరగడం తో ఈ మార్పు కు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.. గతంలో 1 కేజీ కేకు ధర 250 రూపాయలు ఉంటె ఈ సారి డ్రింక్ బాటిల్ ఆశలు చూపి 350 నుండి 450 రూపాయలు వరకు అమ్మేయాలని చుసిన ప్రముఖ బేకరీ వ్యాపారులు అసలుకే మోసం తెచ్చుకొన్నారు. అలాగే ప్రముఖ రెస్టారెంట్లలో అకస్మాత్ గా బిర్యానీ ధరలు పెంచేసి 1000 రూపాయలు కొనుగోలుపై 200 రూ తగ్గింపు ఆఫర్స్ పెట్టిన వారు కూడా భారీగా మిగిలిపోయిన, వేలాది కేకులు, బిర్యానీ పార్సిళ్లను రోడ్లపై పెట్టి అయినకాడికి అమ్మిన కొనే దిక్కు లేకుండా పోయింది. ఈసారి చిన్నస్థాయి వ్యాపారులదే మంచి వ్యాపారం జరిగింది. పండ్ల వ్యాపారులు అందుబాటు ధరలలో అమ్మకాలు బాగా చేసారు. గతం తో పోలిస్తే పువ్వులు, బొకేలు వ్యాపారులు అమ్మకాలు తగ్గాయి అంటున్నారు. పోలీస్ భద్రతా మధ్య పట్టణంలో అర్ధ రాత్రి ఆకతాయిల బైకుల జోరు తగ్గింది. అయితే రాత్రి 12 గంటలకు పట్టణం అంత బాణాసంచా కాంతులతో నూతన ఏడాది 2023 కి ఘనంగా స్వాగతం పలికారు
