సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నారాయణ విద్య సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు.చెయ్యడం తో పాటు తాజాగా నేడు, ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్కు వెళ్లి నారాయణపై ఫిర్యాదు చెయ్యడం తదితర ఘటనలు నేపథ్యంలో.. ప్రియా భర్త.. మాజీ మంత్రి నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం స్పందించారు. నేడు, ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘నా పేరు పొంగూరు సుబ్రహ్మణ్యం నా భార్య కృష్ణప్రియ. తాను కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా తాను కొన్ని వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారని.. ఇది మాకు, మా కుటుంబం పరువుకు భంగం కలిగించేలా.. అభ్యంతరకరంగా ఉన్నాయి. 2017లో కృష్ణప్రియను సైక్రియాటిస్టుకు చూపించామని, అయినా వ్యాధి నయం కాకపోవడంతో 2019లో గుంటూరులో మరో సైక్రియాటిస్టుకు చూపించాము.. అయినా రికవర్ కాలేదు. 2020లో మానస హాస్పిటల్ తెలంగాణలో చూపించాము. అయినా వ్యాధి నయంకాకపోవడంతో గచ్చిభౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చూపించాం, తర్వాత 2023 మేలో కృష్ణప్రియకు క్యాన్సర్ అని వైద్యులు చెప్పారని, యశోద ఆస్పత్రిలో డాక్టర్ శ్రీకాంత్ నా భార్యకు సర్జరీ చేశారు.. తర్వాత 8 కిమో థెరపీలు చేయించమన్నారు. ఇటీవల నా భార్యకు క్యాన్సర్‌కు చికిత్స కారణంగా సైక్రియాటిస్టు మందులు నిలిపివేశారు.. దీనితో ఆమె మాసికముగా ఆందోళనతో ఎదో మాట్లాడుతుంది.. అందువల్ల ఆమె వీడియోలను మానవతా ధృక్పధంతో ఎవరూ పట్టించుకోవద్దు’’ అంటూ పొంగూరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
