సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పవన్ కల్యాణ్, సాయిధర్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్రలో నటుడు పృథ్వీ చేసిన డ్యాన్స్ పై పెద్ద దుమారమే రేగింది. మంత్రి అంబటి గతంలో టివి సీరియల్స్ లో నటించి, డాన్సులు చేసాడని చాల మందికి తెలుసోలేదో? కానీ మంత్రి హోదాల్లో ఉండి కూడా అంబటి రాంబాబు గత సంక్రాంతి పండుగకు రోడ్డుపై స్థానికులతో కల్సి మంచి హుషారుగా స్టెప్స్ వేస్తూ చేసిన డ్యాన్స్ ను పోలి ఉందని టాక్ ప్రచారంలోకి రావడంతో ఈ వివాదం పై మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. ‘నాది ఆనంద తాండవం .. నీది శునకానందం ‘ అంటూ పవన్ కళ్యాణ్, పృథ్విలను నుద్దేశించి కౌంటర్ ఇచ్చారు. అయితే . తాజాగా నేడు, మంగళవారం మీడియా సమావేశంలో.. బ్రో సినిమా కలెక్షన్స్ పై అంబటి రాంబాబు తనదైన స్టైల్లో .. ‘ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు!! అని కామెంట్ చేస్తూ ఎద్దేవా చేసారు. ‘బ్రో’ సినిమాకు తొలిరోజు రూ. 30.05 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రెండో రోజు రూ. 17.05 కోట్లు, 3వ రోజు రూ. 16.9 కోట్లు, ఇక నిన్న 4వ రోజు సోమవారం కేవలం రూ. 5 కోట్లు మాత్రమే వచ్చినట్లు 4 రోజుల్లోప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 69.9 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు మీడియా గణాంకాలు ప్రచారం నేపథ్యంలో మంత్రి అంబటి కి ఆనందం అంబరాన్ని అంటినట్లు ఉంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *