సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే 4 నెలలు లో అసెంబ్లీ ఎన్నికలు తో పాటు లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా మర్చి నెల 2వ వారం కల్లా ఎన్నికలు పక్రియ పూర్తీ
చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా పూర్తీ చేస్తున్నారు. భీమవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి ఎన్నికల అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ.. గతనెలలో విడుదల చేసిన ముసాయిదా ఓట్ల జాబితాపై ఇప్పటివరకు ఫారం 6,7,8 దరఖాస్తులు అందాయి. వాటిలో 28,136 ఓట్లు పరిష్కరించాం. మిగిలిన 15,564 దరఖాస్తులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జరగదని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 6,7,8 దరఖాస్తులకు సంబంధించి ఫారం 9,10,11 ఏ,బీల జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో జరిగే సమావేశాల్లో సంబంధిత ఈఆర్వోల ద్వారా తెలియ జేస్తామన్నారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. ఫిర్యాదులకు వచ్చె నెల 9 వరకు మాత్రమే సమయం ఉందన్నారు.
