సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటిలో ఉండి మండలం యండగండి పరీక్ష కేంద్రం సమస్యాత్మక కేంద్రంగా గుర్తించారు.. పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్స్, సిబ్బంది నియామకలు ఇప్పటికే పూర్తీ చేసారు. పరీక్ష కేంద్రాలలో నిఘా కొరకు సీసీ కెమెరాలను పెడుతున్నారు. ఈ కెమెరాల ద్వారా జిల్లా పరీక్షల నిర్వహణ కేంద్రం వద్ద పరీక్ష కేంద్రాల వీడియో రికార్డ్ అవుతుంది. ఈ నెల 20 నుంచి విద్యార్థులకు వారి తల్లితండ్రుల సెల్‌ఫోన్‌లో వాట్సాప్ నుంచిహాల్ టిక్కెట్స్ అందుబాటులో ఉంచుతున్నారు. దీనితో పలు ప్రెవేటు విద్యాసంస్థలు విద్యార్థులు ఫీజులు పెండింగ్‌లో ఉందనే కారణాలతో హాల్‌టికెట్ ఇవ్వడంలో అడ్డంకులు లేకుండా పోయాయి. జిల్లాలో ప్రవేటు , ప్రభుత్వఇంటర్మీడియెట్ కళాశాలలు, నుండి మొదటి, 2వ ఏడాది ఇంటర్ కలపి మొత్తం 33,845 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయనున్నారు.
