సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు జిల్లా ఫిరంగిపురం (Firangipuram)లోని శాంతి నగర్‌లో నేటి మంగళవారం తెల్లవారు జాము తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేసి తరిమి కొట్టారు. వివరాలలోకి వెళ్ళితే స్థానిక పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలం విషయంలో గ్రామస్తులకు – చిన్నికృష్ణ కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. గుడికి చెందిన సభ్యుల కమిటీహాల్‌కు చెందిన మూడు సెంట్ల స్థలం ను ఆక్రమిస్తున్నారని చిన్ని కృష్ణ అనే వ్యక్తి కుటుంబంపై గ్రామస్తులు పోలీసులకు పిర్యాదు చెయ్యగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని..అక్కడ స్థానికులను విచారిస్తుండగా ఓ యువకుడు వీడియో తీస్తుండటంతో సీఐ రవీంద్ర బాబు అసహనంతో కోపంతో అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం చుసిన గ్రామస్తులు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో పోలీసులను తరమడంతో, సీఐ వారికీ తన రివాల్వర్ చూపించడంతో వారు మరింత కోపంతో ఆయనపై రాళ్ల దాడి చేసి గాయపరచినట్లు ప్రాధమిక సమాచారం. .ఈ క్రమంలో పోలీసుల వాహనం అద్దాలు ద్వంసమయ్యాయి. నేటి మంగళవారం ఉదయం సీఐ క్షమాపణ చెప్పాలని కర్నూలు -గుంటూరు రాహదారిఫై ఆందోళనకారులు టైర్లు తగలపెట్టి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
