సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు ఆదివారం అనం తపురం జిల్లాలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో జరిగిన ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ లక్షలాది మంది పాల్గొన్న భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘‘విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతుందని వచ్చే ఎన్నికలలో ప్రజలు విజ్ఞతతో అలోచించి ఫ్యాను గుర్తుకు ఓటు వెయ్యాలని కోరారు. సైకిల్ కి ఓటు వేస్తె మీకు ఇస్తున్న సంక్షేమ పధకాలు అన్ని కోల్పోయినట్లే.. ప్రభుత్వం నుండి ఇకపై అవ్వ తాతలకు పింఛన్ రాదు, పిల్లల స్కూల్ పీజులు రావు, ఆరోగ్యశ్రీ ఉండదు..వాలంటీర్లు ఉండరు.. అన్ని ఎత్తేస్తారు. మీరే ఆలోచించండి. చం ద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు.ఎగ్గొట్టేవాడు.. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు. మానిఫెస్టో మాయం చేసి.. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. బయట రాష్ట్రాలలో నివాసాలు ఉండే ఈ పొత్తుల నాయకులూ ఏపీ ప్రజలను మోసం చెయ్యడానికి ఈ ఎన్నికల వేళా తిరుగుతున్నారు. నాకైతే జనంతోనే పొత్తు అంటూ సీఎం జగన్ విమర్శలు చేసారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి’’ అంటూ సీఎం జగన్ పంచ్ విసిరారు. 125 సార్లు బటన్ నొక్కి 2.55 లక్షల కోట్లు పేదలకు ఇచ్చాం .. మీరు 2, 3 సార్లు ఆశీర్వదిస్తే.. మరింత మేలు మీకు, రాష్ట్రానికి జరుగుతుంది’’ అని సీఎం జగన్ అన్నారు.
