సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ చైర్మెన్ గా వ్యవహరిస్తున్న ప్రఖ్యాత హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని బసవ తారకం కాన్సర్ హాస్పటల్ లో నేడు, మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నేటి 4వ తేదీ నుండి ఈ ఫిబ్రవరి నెల 28వ తేదీవరకు ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు క్యాంప్ ఏర్పాటు చేసారు. తెలుగు రాష్ట్రాలలోని వారు అక్కడ ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీస్ లో ప్రతి రోజు ఉ.10 నుంచి మ.1 గంట వరకు ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను చాల తక్కువ ధరకు చేయనున్నట్లు హాస్పటల్ వర్గాలు పేర్కొన్నాయి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు , అనుమానితులు టెస్టుల ఉచిత సేవలు ను వినియోగించుకోండి.
