సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్‌పై ఆస్తుల వివాదంపై చేసిన వ్యాఖ్యాల లో జగన్ తనకు ఆస్తులు పంచాలన్న విషయం వైవి సుబ్బారెడ్డి , విజయ సాయి రెడ్డి కి కూడా తెలుసును అయినా వారు ఆయన మోచేతి నీళ్లు త్రాగుతున్నారు అని చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో.. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి జగన్ స్వయంగా సంపాదించుకొన్న ఆస్తులు కాబ్బటి ఆయనను కుట్రలో అరెస్టు చేసారు. షర్మిల ఎందుకు జైలు కు వెళ్ళలేదు ? అని తేల్చి పారేయడంతో.. తాజా గా నేడు, ఆదివారం ఎంసీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) కూడా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలది ఆస్తి తగాదా కాదని.. అధికారం కోసం తగాదా అని అన్నారు. 95 శాతం షర్మిల ప్రెస్ మీట్లు జగన్‌ను తిట్టడానికి పెట్టినవేనని.. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే జగన్‌పై ఆమె పోరాటం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ మరణానికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబుతో షర్మిల చేతులు కలపటం బాధాకరమని అన్నారు. తండ్రి మరణానికి చంద్రబాబు కారణమని గతంలో అనేకసార్లు షర్మిల చెప్పలేదా? అని ప్రశ్నించారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు.. కానీ జగన్ మళ్ళీ సీఎం కావొద్దని షర్మిల కంకణం కట్టుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. శత్రవులకు మేలు చేయటం కోసం.. సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్ళని ఎవర్నీ చూడలేదన్నారు. చంద్రబాబు అజెండాను షర్మిల అమలు చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ నేత శంకరరావు టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోకగజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డిని ఉపయోగించి చంద్రబాబు జగన్‌ను జైలుకు పంపారని, వారిని వెనకేసుకొని వస్తున్నా షర్మిల ప్రవర్తన వై యస్ కుటుంబ అభిమానులు సహించరని అన్నారు జగన్ మోచేతి నీళ్ళు తాగి లబ్ధి పొందానని షర్మిల తన పేరు వాడినందునే తాను స్పందిస్తున్నానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
