సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు గత ఆదివారంరాత్రి హైదరాబాద్‌ నోవాలెట్‌ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరయ్యారు. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు మెగాస్టార్ చిరంజీవి, విక్టరి వెంకటేష్ ,టి. సుబ్బరామిరెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌,, రాజశేఖర్ దంపతులు, అశ్వినీదత్‌, అల్లు అర్జున్, సుహాసిని, నాని, మంచు విష్ణు, మాలశ్రీ, గోపీచంద్‌, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, మంచు విష్ణు, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారెందరో ఈ వేడుకకు హాజరయ్యారు.( నాగార్జున , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మినహా) కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బాలయ్య బాబు 50 సంవత్సరాల నట జీవితం ఒక అరుదయిన రికార్డు. ఈ కన్నుల పండుగలాంటి వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ.. తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. నేను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఆదర్శం కూడా ‘సమరసింహారెడ్డి’. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరికఉంది. ‘ఇంద్ర వర్సెస్‌ సమరసింహారెడ్డి’ అని రెండు పాత్రలను క్రియేట్‌ చేసి.. అలాంటి కథ ఉంటే యాక్ట్‌ చేయడానికి నేను రెడీ.. బాలయ్య మీరు రెడీనా’’ అని చిరంజీవి బాలకృష్ణను అడిగారు. ‘యెస్‌ .. రెడీ.. రెడీ ‘అని బాలకృష్ణ కూడా అంగీకారం తెలిపారు. చిరంజీవి అక్కడే ఉన్న బోయపాటి ని మీరు హ్యాండిల్ చేస్తే ఇంకా బావుతుంటుంది అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కానీ బయట ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు.మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. అందరూ కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ లాంగ్ లివ్ బాలయ్య.. అని అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *