సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ వై యస్ రాజశేకర్ రెడ్డి మొదలుకొని వైసిపి నేతలపై వెదవలు, సన్నాసులు అంటూ పదజాలంతో చేసిన వ్యాక్యలపై వైసిపి మంత్రులు అంబటి , రోజా, అమర్నాధ్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే తనదయిన ధోరణిలో సుతిమెత్తని మాటలతో పవన్ ఫై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేసారు. వై ఎస్ ఉన్నపుడు పవన్ ప్రజారాజ్యం పార్టీ తో వై ఎస్ ను సీఎం అవ్వకుండా ఆపగలిగాడా? పంచా లాగడా? ఆయన హయాంలో 2009 తరువాత 2014 వరకు ఎక్కడ పవన్ కనపడకుండా పోయాడు..వై ఎస్ పంచెలో ఒక పోగు కూడా తాకలేనివాడివి ఎందుకు బిల్డుప్ బాబాయ్ మాటలు..దేశాన్ని పాలిస్తున్న సోనియా ను ఎదిరించాడని అక్రమ కేసులు పెడితే మీరు చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలసి కుమ్మక్కయి జగన్ ను జైలుకు పంపించారని జనం నమ్మారు కాబట్టే, జగన్ చేసిన ఒంటరి పోరాటం తో ఆయనను సీఎం చేసారు. నువ్వు ఒంటరి పోరాటం చేస్తే వీరమరణం మే అని సభలోనే ఒప్పేసుకొనవు. మరోసారి ఎన్నికలలో పోటీ చేస్తే నీ పార్టీ కి కుక్క చావు అని నీకు తెలుసు.. అందుకే చంద్రబాబు ప్యాకేజి కోసం మన కాపులను అమ్మేస్తున్నావు.. నిన్ను చుస్తే మన కులపోళ్ళ అయిన నాకే సిగ్గు వేస్తుంది. 3 పెళ్లిళ్లు అయిన.. ఇంట్లో భార్య ను పెట్టుకొని, బయటి అమ్మాయిలను ఇంటికి తెప్పించుకొని…సినిమా మహిళలను హీనంగా మాట్లాడే నీలాంటి తిరుగుబోతు రెచ్చగొట్టుడు మాటలకు.. జనసేన కార్యకర్తలు పోరాటాలు చేసి జైళ్లు కు వెళ్లిపోవాలా? వారి భవిషత్తులు నాశనం చేసుకోవాలా? మంత్రి రోజా జనంలో తిరిగి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇప్పడు మంత్రి అయ్యింది. రెండు చోట్లా ఓడిపోయిన నీకు ఆమెకు పోలికా ? ఒక్క వైసిపి తప్ప అన్ని పార్టీలతో సిపిఐ, సిపిఎం, బి ఎస్పీ , కాంగ్రెస్ , టీడీపీ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొనే రాజకీయ వ్యభిచారి పవన్.. నాయకుడు ముందు నడవాలి అంతే కానీ సభలకు వచ్చినవారిని మీరు ఓట్లు వెయ్యరు.. మీరు నన్ను గెలిపించరు అని కార్యకర్తలను అవమానించినప్పుడే..మీ పరాజయం స్వయంగా ఒప్పేసుకొన్నావు.. ని సొల్లు వాగుడు తో సీఎం జగన్ కాదుకదా వైసిపి జెండా పట్టుకొని తిరిగే కార్యకర్త వేలి వెంట్రుక కూడా పీకలేవు అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *