సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని బీవీ రాజు కళాశాలలో జూన్ 26 అంతర్జాతీయ మారకద్రవ్య నిరోధక దినోత్సవం పురస్కరించుకుని జాతీయ సేవా పథక విభాగం ఒకటి మరియు రెండు ల ఆధ్వర్యంలో ఓ అవగాహన సదస్సు జరిగినది దీనిలో ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమవరం మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి, శ్రీసత్య దేవి పాల్గొన్నారు, వీరితో పాటుగా భీమవరం డిఎస్పీ, బి త్రినాథ్ , భీమవరం బారసోసియేషన్ సెక్రెటరీ, పి రమేష్ బాబు, భీమవరం లీగల్ ఎయిడ్ కౌన్సిల్, ఎన్ సుధీర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐఆర్ కృష్ణంరాజు , వైస్ ప్రిన్సిపల్ సి హెచ్ ఎస్ వి సత్యనారాయణ వివిధ శాఖాధిపతులు ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఈ మారకద్రవ్యాలు స్వీకరణ ఎక్కువగా ఉందని వాటిని నివారించడానికి మీ విద్యార్థులు ఎంతగానో పాటుపడాలని, దుర్వ్యసనాలకు దూరంగా ఉంది సమాజాన్ని మారకద్రవ్యాల స్వీకరణ నిరోధకంగా చేసి మంచి సమాజాన్ని నెలకొల్పే విధంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ విభాగాలను హాజరైన ఎన్ఎస్ఎస్ కార్యకర్తలను ప్రశంసించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *