సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు శుక్రవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భముగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్నారు. తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్.. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందన్నారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు. బీజేపీ ఎదుగుతున్నా కొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలన్నారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యం బీజేపీయేనన్నారు.మోదీ, అమిత్‌షా డైరెక్షన్‌లో బీజేపీ దూసుకుపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *