సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 15 రోజులలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి తెలంగాణలో పలువురు పార్టీల నుండి నేతల జంపింగులతో కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫుల్ అయ్యిపోయింది. అధికార బిఆర్ఎస్ తో నువ్వానేనా అన్న రీతిలో పోటీ జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ప్రక్కన కర్ణాటక ఎన్నికల ముందువరకు .. బండి సంజయ్ పార్టీ అడ్జక్ష పదవి నుండి తప్పించక తెలంగాణలో బీజేపీ జోష్ఒక్కసారిగా తగ్గినట్లు కనిపిస్తుంది. ఎన్నికలు జరిగాక అసలు ఓటర్లు ఏ ఉన్నారో? హాంగ్ వస్తుందో? తెలుస్తుంది. అయితే తాజాగా బీజేపీ నుండి సీనియర్ నేత, సినీనటి విజయశాంతి తప్పుకొన్నారు. కిషన్ రెడ్డి కి తన రాజీనామా పత్రం పంపించారు. విజయశాంతి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షం లో ఆమె రేపు(శుక్రవారం) హైదరాబాద్ బహిరంగ సభలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొంటారని సమాచారం.. కాంగ్రెస్ చేరిక తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికల్లోమెదక్ నుంచి రాములమ్మ ఎం పీగా పోటీ చేసే అవకాశం ఉంది.
