సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీమవరంలోని యూత్ కల్చరల్ అసోసియేషన్ లో ( పెద్దమిరం వైపు) ఇంటర్నేషనల్ ఫెడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నామని అసో సియేషన్ అధ్యక్షుడు పీవీఎల్ నరసింహరాజు తెలిపారు. టోర్రీ బ్రోచర్లు ఆవిష్క రించారు. పశ్చిమగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ల సహకారంతో పోటీలు నిర్వహించ నున్నామన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఆటగాళ్లు అంతర్జాతీయ రేటింగ్ సాధించు కోవచ్చన్నారు. ఈ పోటీలకు సుమారు 300 మం ది క్రీడాకారులు హాజరుకానున్నారని, విజేతలకు రూ.5 లక్షల బహుమతులు అం దిస్తామనిచెప్పారు. వివరాలకు సెల్ 90632 24466లో సంప్రదించాలని కోరారు.
