సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భీమవరం గునుపూడి శ్రీశ్రీశ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారినిమరియు వీరమ్మ పార్క్ వద్ద ,శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత బోగలింగేశ్వర స్వామి వారిని ఆలయ మర్యాదలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, కుమారుడు గ్రంధి రవితేజ వారి కుటుంబ సభ్యులు స్వామివారికి ఓ భక్తుడు కానుకగా సమర్పించిన సుమారు 260 గ్రాముల బంగారు హారం ను స్వామికి అలంకరణ కార్యక్రమం లో పాల్గొన్నారు... అనంతరం నాచువారి సెంటర్ వైపు నుండి వారి ఆలయం వైపు వస్తున్నా భక్తులకు ఆలపాటి రమణ స్వచ్చంధంగా ఏర్పాటు చేసినటువంటి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు…భక్తులకు కొద్దీ సేపు స్వయంగా మజ్జిగ పోసి దాహార్తిని తీర్చారు. దాతను అభినందించారు.
