సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవిత్ర తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, హిందూ సనాతన ధర్మ యోధుడు ( పవన్ ) ప్రస్తుతం తిరుమల లో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు తొక్కిసలాటలో తీవ్ర గాయాలు అయ్యి ఆసుపత్రి పాలయిన భక్తుల కు శ్రీవారి భక్తులకు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు.హిందూ ధర్మ పరిరక్షణ కోసం పిలవగానే మీ ప్రక్కనే నిలబడతాను అని, ఇదే తిరుపతిలోనే స్పీచ్ దంచిన మహా యోధుడు ఇప్పుడు బాద్యులను శిక్షిస్తాడా? భక్తులు చనిపోతే హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆ పీఠాధిపతులు బయటకు రావాలని.. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు ప్రధాని మోడీ ఇక కలుగజేసుకోవాలని కోరారు. మరణించిన ప్రతి భక్తుడి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేసారు. తిరుపతి ఘటనకు అధికారులను బాద్యులను చేసి చేతులు దులుపుకొంటే సరిపోదని , గతంలో పని చేసిన సమర్థులను తొలగించి చంద్రబాబు భజన చేసే అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్సీ, కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని.. వీరు ఎవరికీ భక్తి లేదన్నారు. వైసీపీ నేతలపై ఎలా తప్పుడు కేసులు పెట్టాలనే ఒత్తిడితో పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారని.. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. హీరో అల్లు అర్జున్‌కు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టారని.. మరి తిరుపతి ఘటనలో 6 గురు భక్తులు చనిపోతే చంద్రబాబు నుంచి బీఆర్ నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలన్నారు. అయిన చంద్రబాబు ఎప్పడు అధికారంలోకి వచ్చిన ప్రజలు మరణిస్తూనే ఉంటారని, అప్పుడు గోదావరి పుష్కరాలలో 29 మంది , ఇటీవల విజయవాడ వరదలలో 60 మంది ఇప్పుడు తిరుపతిలో.. ఇలా ఎన్నోసార్లు ఎందరో అమాయకులు మరణిస్తున్నారని ఎద్దేవా చేసారు రోజా..
