సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరంలో భర్తను స్వయంగా భార్య కడతేర్చిన ఘటన నేటి బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్ళితే భీమవరం వన్ టౌన్ లో వెంకయ్యనాయుడి వీధిలో ఉన్న గంధం అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న ఏలూరు వెంకటేశ్వరరావు (58)ను గత అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో అతని భార్య పీక పిసికి చంపేసి స్వయంగా ఆమె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవడం జరిగింది.రోజు మద్యం తాగి భర్త నన్ను వేధిస్తున్నాడని అందుకే చంపేశానని తెలిపింది. తదుపరి గత అర్ధరాత్రే పోలీసులు చంపబడిన భర్త మృత దేహాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నేటి ఉదయం మృతదేహాన్ని విచారణ నిమిత్తం తరలించారు. స్థానికులు చెప్పిన వివరాలలోకి వెళ్ళితే,.. మృతుడు ఏలూరు వెంకటేశ్వర రావు గత ఏడాది న్నర క్రితమే అపార్ట్మెంట్ కు వాచ్ మెన్ గా పనిలో చేరాడు. క్రింద సెల్లర్ లో రూంలోభార్య లక్ష్మి తో కలసి నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వారికి పెళ్లిళ్లు అయ్యి అత్తారింటికి వెళ్లిపోయారని తెలుస్తుంది. అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవలు పడటం తాము చూసిన పరిస్థితి ఇంతా దాక వస్తుందని తాము ఊహించ లేదన్నారు. కోపంలో క్షణికావేశంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీస్ దర్యాప్తు లో పూర్తీ సమాచారం రావాల్సి ఉంది.
