సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలిసో తెలియకో ట్రంప్ తన దూకుడు చేష్టలతో భారత్ రష్యా చైనా త్రిముఖ కూటమి కి పరోక్షంగా సహకరిస్తున్నారు. రష్యా అడ్జక్షుడు పుతిన్ భారత్ లో పర్యటన ఈ ఆగస్టు నెల చివరలో ఖరారు అయ్యింది. దీనితో తిక్క రేగిన ట్రంప్ 50 శాతం భారీ సుంకాలతో పాటు తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌తో ఇకపై వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో, భారత్- అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై భారత్ తో పాటు అమెరికాలో ట్రంప్ సన్నిహితులలో కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ ట్రంప్ పేరు ఎత్తకుండా పరోక్షంగాస్పందించారు. గత, గురువారం ఎమ్ఎస్ స్వామినాథన్ సెంటెనరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాని.. దేశ ప్రయోజనాల కోసం తాను వ్యక్తిగతంగా ఎంతటి మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని అన్నారు. ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, డెయిరీ రంగం విషయంలో భారత్ రాజీ పడదని స్పష్టం చేశారు. అయితే అమెరికా ఫై భారత్ కూడా అదే స్థాయి పన్నులు పెంచాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *