సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పంచారామ క్షేత్రం గునుపూడిలోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు నేడు, గురువారం హుండీలు అన్నియు తెరిచి లెక్కించగా రూ 10, 50,655/- ఆదాయం లభించింది. ఈ లెక్కింపు కార్యక్రమంలోకొనితివాడ కార్యనిర్వహణాధికారి, కర్రి శ్రీనివాసరావు మరియు ఆలయ కార్య నిర్వహణ అధికారి, డి రామకృష్ణంరాజు మరియు గ్రామస్తులు సేవా సభ్యులు,స్టేట్ బ్యాంక్ సిబ్బంది పాల్గొని ఉన్నారు. శ్రీ స్వామివారి నిత్య అన్నదానం ట్రస్ట్ కు భక్తుల నుండి 18,886 రూపాయలు కానుకగా వచ్చి యున్నది. పైన తెలిపిన స్వామి వారి హుండీలు అన్ని యు 148 రోజులకు ఆదాయం వచ్చి ఉన్నది అని తెలిపారు.
