సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క పాక్ ఫై మిసైల్స్ తో యుద్ధభేరి మ్రోగించినప్పటికీ భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా అదే రీతిన దూసుకొనిపోవడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అటు, ట్రంప్ టారిఫ్స్ పెడితే, యావత్ ప్రపంచం ఒణికిపోతే, ఇండియా మాత్రం ఏ మాత్రం తొణకలేదు. ఇదే ఊపుని ఇప్పుడు యుద్ధం సమయంలోనూ చూపించాయి.(నిన్న మంగళవారం నష్టాలలో ఉన్నపటికీ) నేడు, బుధవారం సెన్సెక్స్ 105.71 పాయింట్లు లాభపడి, 80,746.78 దగ్గర ఉంటే, నిఫ్టీ 34.80 పాయింట్లు పెరిగి 24,414.40 దగ్గర ముగిసింది. నిఫ్టీలో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా ప్రధాన లాభాలను ఆర్జించగా, ఆసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఐటిసి నష్టపోయాయి. ఎఫ్‌ఎంసిజి, ఫార్మా మినహా అన్ని రంగాలలో మిగతా సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఇప్పట్లో కోలుకోలేనంతగా దెబ్బ తింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *