సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వాడవాడలా నేడు, బుధవారం .. స్వాతంత్రోద్యమం లో ప్రభవించిన విప్లవాగ్ని.. అల్లూరి సీతారామ రాజు 101 వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భీమవరం తాలూకా మోగల్లు గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామ రాజు ఖ్యాతి దేశం యావత్తు పాకింది. భీమవరం ఏ ఎస్ ఆర్ నగర్ లోని దేశ ఖ్యాతి గాంచిన 35 అడుగుల అల్లూరి సీతారామ రాజు కాంస్య విగ్రహంతో పాటు, ప్రకాశం చౌక్ లోను, ఇక్కడికి సమీపంలోని అల్లూరి .. స్వగ్రామం మోగల్లులోను పలుచోట్ల అల్లూరి.. విగ్రహాలకు పుష్ప మాలలు వేసి స్థానికులు, ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. దీనిలో భాగంగా నరసయ్య అగ్రహారంలోని అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, జిల్లా సిపిఐ పార్టీ మరియు ప్రజా నాట్యమండలి అధ్వర్యంలో అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మరియు సిబ్బంది అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది ( ఫై ఫోటో)… నా దేశం, నా ప్రజలు పరాయి పాలనలో ఉండటం సిగ్గు చేటని విల్లంబులతో మన్యం మన్యం ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన అల్లూరి చిరస్మరణీయుడని అన్నారు.
