సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భారత్ లో క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగ వచ్చేస్తుంది. అక్టోబర్ 5 నుంచి జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్ కోసం బరిలోకి దిగే పది జట్లు తేలిపోయాయి. భారత్తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ టాప్-8లో ఉన్నాయి. ఒకనాటి విశ్వ విజేత వెస్ట్ ఇండీస్ అర్హత సాధించలేని దీనపరిస్తితికి చేరుకోవడం విషాదం.. ఇక అర్హత మ్యాచ్లో బలమైన జట్లను దాటుకొని నెదర్లాండ్స్ టాప్-10లోకి చేరింది. అంతకుముందు శ్రీలంక అందరికంటే ముందు క్వాలిఫయర్స్ మ్యా చ్లతోనే అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పది జట్లు సిద్ధమైపోయాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యా చ్ జరగనుంది. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచులకు సంబంధించి తాజా వివరాలు:
భారత్ X ఆస్ట్రేలియా : అక్టోబర్ 8, చెన్నై
భారత్ X అఫ్గానిస్థాన్ : అక్టోబర్ 11, దిల్లీ
భారత్ X పాకిస్థాన్ : అక్టోబర్ 15, అహ్మదాబాద్
భారత్ X బంగ్లాదేశ్ : అక్టోబర్ 19, పుణె
భారత్ X న్యూజిలాండ్ : అక్టోబర్ 22, ధర్మశాల
భారత్ X ఇంగ్లాండ్ : అక్టోబర్ 29, లక్నో
భారత్ X శ్రీలంక: నవంబర్ 2, ముంబయి
భారత్ X దక్షిణాఫ్రికా: నవంబర్ 5, కల్ కత్తా
భారత్ X నెదర్లాండ్స్ : నవంబర్ 11, బెంగళూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *