సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మనుషులలో సొంత వారిపై కూడా మానవత్వం తగ్గిపోయి కసాయి తనం పెరిగిపోతుందని నేడు ఉదయం భీమవరంలో తల్లిని తమ్ముడిని కత్తితో నరికి చంపినవాడు ఒకడు అయితే, మరో ఘటన లో భార్యను ఆమె తండ్రిని తమ్ముడిని కత్తితో నరికి పారేసాడు మరొకడు.. అంతా హింసే.. భీమవరం సమీపంలోని గొల్లలకోడేరు గ్రామంలో లో దారుణం చోటు చేసుకుంది. తనపై కోపంతో తన భార్య పుట్టింటికాడే ఉండిపోయిందని కుటుంబ కలహాల నేపధ్యంలో విరవల్లి రామచంద్రరావు తన మేనమావ మట్టపర్తీ కృష్ణతో కలిసి భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ లపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో ఏకంగా చాకు విరిగిపోవడంతో పక్కనే వున్న కత్తితో రామచంద్రరావు దాడి చేశాడు. కాగా గాయపడిన శ్రీలక్ష్మి,సత్యనారాయణలను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కత్తితో నరకడంతో రాజేష్ కు అరచేయి తెగిపోవడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కాగా దాడి చేసిన శ్రీలక్ష్మి భర్త రామచంద్రరావు పరారీ కాగా, రామచంద్రరావుకు సహకరించిన అతని మేనమామ కృష్ణ అత్తిలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ( ఫై ఫొటోలో భార్యతో ఉన్మాది.. మరో ఫొటోలో ఆసుపత్రిలో మామ సత్యనారాయణ) )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *