సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన బాహుబలి 1 ,2 సిరీస్ కలపి ఈ కొత్త వెర్షన్‌కి “బాహుబలి: ది ఎపిక్” అనే టైటిల్ పెట్టారు. ఇది సాధారణ రీ-రిలీజ్ కాదు, పూర్తిగా డిజిటల్‌గా రీ-ఎడిట్ చేసిన, రీ-మాస్టర్ చేసిన కొత్త వెర్షన్. గత అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “బాహుబలి: ది ఎపిక్” ఇప్పుడు రెండో వారం కూడా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 కోట్లు కలెక్షన్స్ (₹49.8 కోట్లు) సాధించిన తోలి రి రిలీజ్ సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కొత్త వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 థియేటర్లలో విడుదలైంది. అందులో అమెరికాలో 400 స్క్రీన్లు, గల్ఫ్ దేశాలు, యూరప్ వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మేడ్ ఇన్ భీమవరంలో అయితే 7 రోజులకు ఏకంగా కొత్త సినిమా తరహాలో 16 లక్షల రూపాయలు వసూళ్లు సాధించి సరికొత్త అల్ టైం రికార్డు సృష్టించింది. (గతంలో ఏ రిరిలీజ్ సినిమా కూడా 6లక్షలు రూపాయలు కలెక్షన్ దాటటం గగనం..)
