సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ ; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో నేడు బుధవారం భీమవరంలో పలు చోట్ల ఉన్న స్వర్గీయ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. తెలుగు ప్రజలకు ప్రత్యక రాష్ట్రము కావాలని పొట్టి శ్రీరాములు మొదట నిరాహార దీక్ష చేసింది భీమవరం త్యాగరాజ భవనంలో అన్న విషయం చాల మందికి తెలియదు. భీమవరంలో కొద్దీ రోజులు నిరాహార దీక్ష చేసి ..ఢిల్లీ వరకు గట్టి కవరేజ్ కావాలంటే, అప్పటి మద్రాస్ రాజధానిలోనే కూర్చోవాలని తదుపరి కొంతకాలానికి అక్కడ ప్రారంభించారు. స్థానిక ఆదివారం బజారు సెంటర్ లోని పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి , స్థానిక పొట్టిశ్రీరాములు గర్ల్స్ హైస్కూల్ లోను ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. ఫై చిత్రంలో .. హౌసింగ్ బోర్డు కాలనీలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ అధ్యక్షులు, కంతేటి వేంకట్రాజు ,కాలనీ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శలు సరిపిడకల రామారావు, సయ్యపరాజు సూరిబాబు, చెరుకువాడ రంగశాయి,తటికొండ కోటేశ్వరరావు గుప్తా, K V కృష్ణంరాజు, మేడిపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు
