సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఆక్వా రైతుల పంట నష్టాలకు బీమా పాలసీ కల్పనకు ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భీమవరం నియోజకవర్గం వీరవాసరం లో గత శనివారం అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మ డి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి విశేషంగా ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. వీరికి ఓరియంటల్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరు అయి తమ ఇన్సూరెన్స్ పాలసీల వివరాలను రైతులకు వివరించారు. సాగు కాలం , ప్రీమియం రేట్లు, సైక్లోన్ జోన్, నాన్ సైక్లోన్ జోన్లలో పాలసీ కవరేజీ వివరాల గురించి అవగాహన కలిపించారు. రైతులు తమ ఎంపిక ప్రకారం 135 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రాథమిక పాలసీ ఎం చుకోవడం ద్వా రా ప్రకృ తివైపరీత్యా ల నుంచి చేపలు, రొయ్యలు పంట నష్టాన్ని కవర్ చేసుకోవచ్చు నని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *